అఖిల్ అంత డిమాండ్ చేస్తున్నాడా..!

March 13, 2018


img

అక్కినేని ఫ్యామిలీ నుండి మూడవతరం వారసుడిగా అఖిల్ సినిమాతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ఇక సెకండ్ ప్రయత్నంగా చేసిన హలో పర్వాలేదు అనిపించినా తన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు. అయితే అఖిల్ 3వ సినిమా క్రేజీ కాంబినేషన్ సెట్ చేయాలని చూస్తున్నారట. 

ప్రముఖ నిర్మాత బోగవల్లి ప్రసాద్ అఖిల్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారట. అయితే అఖిల్ ఆ సినిమాకు రెమ్యునరేషన్ గా 10 కోట్ల దాకా డిమాండ్ చేస్తున్నాడట. పారితోషికం విషయంలోనే ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలుస్తుంది. వెంకీ అట్లూరి తో తన మూడవ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అఖిల్ రెమ్యునరేషన్ తగ్గించుకుంటేనే మంచిదని అంటున్నారు. అయితే నాగార్జున మాత్రం అఖిల్ 3వ సినిమా కూడా అన్నపూర్ణ బ్యానర్ లోనే తీయాలని చూస్తున్నారట.Related Post

సినిమా స‌మీక్ష