మేడం టుస్సాడ్స్ లో కట్టప్ప..!

March 12, 2018


img

లండన్ లో ప్రతిష్టాత్మక మేడం టుసాడ్స్ మ్యూజియం లో కట్టప్ప మైనపు విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారు. బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే అక్కడ ప్రభాస్ మైనపు బొమ్మ ఏర్పరిచారు. ఆ దారిలో ఇప్పుడు కట్టప్ప పాత్రదారి సత్యరాజ్ మైనపు బొమ్మని కూడా ఏర్పరుస్తున్నారని తెలుస్తుంది. బాహుబలి సినిమా కేవలం హీరో, హీరోయిన్, డైరక్టర్ మాత్రమే కాదు అందులో చేసిన ప్రతి పాత్రకు క్రేజ్ లభించింది.

సౌత్ లో ప్రభాస్ మాత్రమే మేడం టుస్సాడ్స్ లో మొదట మైనపు బొమ్మని ఏర్పరచుకోగా ఇప్పుడు ఆ తర్వాత స్థానంలో సత్యరాజ్ ఉన్నాడు. ప్రభాస్ మైనపు బొమ్మ టుస్సాడ్స్ బ్యాంకాక్ బ్రాంచ్ లో ఉండగా సత్యరాజ్ స్టాట్యూ మాత్రం ఏకంగా లండన్ లోనే ఉంచుతున్నారట. త్వరలోనే కొలతలు తీసుకునేందుకు వస్తారని తెలిపారట. ఇందుకు సత్యరాజ్ ను తమిళ్ పరిశ్రమ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. Related Post

సినిమా స‌మీక్ష