అమ్మడి లక్కు మాములుగా లేదు..!

March 12, 2018


img

మొదట టాలీవుడ్ లో ఐరన్ లెగ్ అనిపించుకున్న అమ్మడు ఇప్పుడు గోల్డెన్ హ్యాండ్ గా మారి లక్కీ ఛాన్సులు పట్టేస్తుంది. వరుస స్టార్ అవకాశాలను అందుకుంటూ క్రేజ్ సంపాదిస్తున్న ఈ భామ ఎవరో కాదు డిజే భామ పూజా హెగ్దె. ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలుకరించిన ఈ అమ్మడు ఆ రెండు సినిమాలతో సంపాదించలేని క్రేజ్ బన్ని డీజే లో నటించి పాపులారిటీ తెచ్చుకుంది.

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం సినిమాలో నటిస్తున్న అమ్మడు ఎన్.టి.ఆర్, మహేష్ లాంటి స్టార్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు అమ్మడు మరో క్రేజీ ఆఫర్ ను సొంతం చేసుకుందని తెలుస్తుంది. సాహో తర్వాత ప్రభాస్ జిల్ రాధాకృష్ణ డైరక్షన్ లో ఓ మూవీ ఫిక్స్ చేయబోతున్నాడట. ఇందులో హీరోయిన్ గా పూజాను ఫైనల్ చేశారట. బన్ని తర్వాత ఎన్.టి.ఆర్, మహేష్, ప్రభాస్ ఇలా వరుస స్టార్ ఛాన్సెస్ కొట్టేసిన ఈ అమ్మడు రాం చరణ్ తో రంగస్థలం సినిమాలో ఐటం సాంగ్ లో కూడా నర్తిస్తుందట. మరి చూస్తుంటే పూజా హెగ్దె సూపర్ పాపులారిటీతో టాప్ లేపేలా ఉంది.Related Post

సినిమా స‌మీక్ష