అ!తను నానిని వదలట్లేదు..!

March 12, 2018


img

నాచురల్ స్టార్ గా నానిలో హీరోని మాత్రమే చూసిన మనం అతన్ని నిర్మాతగా మార్చేలా చేసిన ఘనత దక్కించుకున్నాడు ప్రశాంత్ వర్మ. అ! లాంటి ప్రయోగాత్మక సినిమాను తన నిర్మాణంలో రావడం గొప్పగా భావించాడు నాని. నిజంగా సినిమా కూడా అంతే గొప్పగా ఉంది. అ! వచ్చింది మంచి టాక్ సొంతం చేసుకుంది. నానికి కాస్త కూస్తో లాభాలను తెచ్చి పెట్టింది.

అయితే ఇక్కడితో మ్యాటర్ అయిపోయింది అనుకుంటే పొరపాటే.. అ! డైరక్టర్ మళ్లీ నానితోనే సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాడు. అయితే ఈసారి నిర్మాతగా కాకుండా నాని హీరోగా ప్రశాంత్ వర్మ సినిమా రాబోతుంది. ఈ సినిమా కూడా ఓ ప్రయోగమే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందట. వరుస విజయాలు వస్తున్నా రొటీన్ సినిమాలు చేస్తున్నాడు అన్న వార్తలకు నాని ప్రశాంత్ వర్మ సినిమాతో షాక్ ఇస్తాడేమో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష