రంగస్థలం అసలు రంగు ఇదే..!

March 12, 2018


img

మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం. ఈ నెల చివరన రిలీజ్ అవుతున్న ఈ మూవీలో చిట్టిబాబుగా రాం చరణ్ కనిపిస్తున్నాడు. పల్లెటూరి ప్రేమకథగా వస్తుందని చెబుతున్న ఈ సినిమాలో పొలిటికల్ టచ్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. సినిమాలో చరణ్ బ్రదర్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. అతనికి సంబందించిన ఓ పోస్టర్ లీక్ అయ్యింది.


కుమార్ బాబుగా ఆది రంగస్థలం గ్రామపంచాయతి ప్రెసిడెంట్ అభ్యర్ధిగా పోటీలోకి దిగుతున్నాడు. ఆ పోస్టర్ ఇప్పుడు లీక్ అయ్యింది. సినిమాలో చరణ్ తో పాటుగా ఆది, ప్రకాశ్ రాజ్ పాత్రలు కూడా ప్రాముఖ్యతతో ఉంటాయని తెలుస్తుంది. ఇక లీక్ అయిన ఈ పిక్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. కుమార్ బాబుగా ఆది లుక్ ఇంప్రెస్ చేసింది.Related Post

సినిమా స‌మీక్ష