మెహబూబాకు గుమ్మడికాయ కొట్టేశారు..!

February 24, 2018


img

పూరి జగన్నాథ్ దర్శక నిర్మాణం లో ఆకాష్ హీరోగా వస్తున్న సినిమా మెహబూబా. వరుస ఫ్లాపులతో డీలా పడిన పూరి తన సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమై తనయుడితో ఈ సినిమా చేస్తున్నాడు. అందుకు తగినట్టుగానే టీజర్ కట్ చేసి వదిలాడు. టీజర్ తో ఇంప్రెస్ చేసిన జగన్ సినిమా పక్కా హిట్ కొట్టేలా రూపొందించారట. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టుగా చిత్రయూనిట్ అందరితో దిగిన ఫోటో షేర్ చేసింది ఛార్మి.

పూరి కనెక్ట్స్ నిర్మిస్తున్న సినిమాల్లో భాగస్వామ్యం ఉంటున్న ఛార్మి మెహబూబా సినిమాకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అని చెప్పొచ్చు. నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కు సందీప్ చౌతా మ్యూజిక్ అందిస్తున్నాడు. 1971 కాలంలో ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలో జరిగిన ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతుంది. చూస్తుంటే పూరి జగన్నాథ్ ఈసారి తన ఫుల్ ఎఫర్ట్ ఈ సినిమా కోసం పెట్టాడని అనిపిస్తుంది. సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష