మణిరత్నం కు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్..!

February 24, 2018


img

దేశం గర్వించదగ్గర దర్శకుల్లో ఒకరైన మణిరత్నం తన క్లాసిక్ సినిమాలతో భాషతో సంబంధం లేకుండా అభిమానులను ఏర్పరచుకున్నారు. ఎంతోమంది దర్శకులు వస్తున్నా మణిరత్నం లాంటి టేకింగ్ ఎవరు చేయరని చెప్పొచ్చు. ఇక ఈ దిగ్గజ దర్శకుడికి బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్ లో లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ ఇవ్వబోతున్నారు. ప్రశంసా పత్రంలో పాటుగా 10 లక్షల నగదు బహుమతి కూడా అందచేస్తారట.

13 మంది కమిటీ సభ్యులు మణిరత్నం కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ ఇవ్వాలని నిర్ణైంచారు. మార్చి 1న బి.ఐ.ఎఫ్.ఎఫ్ క్లోజింగ్ రోజున ఈ అవార్డ్ ప్రధానోత్సవం ఉంటుందని తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి కర్ణాటక సిఎం సిద్ధారామయ్య ముఖ్య అతిధిగా వస్తారని తెలుస్తుంది. ఆయన చేతుల మీదగానే మణిరత్నం ఈ అవార్డ్ అందుకోనున్నాడట. కన్నడ సినిమా పల్లవి అనుపల్లవితో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన మణిరత్నం సమాజానికి ఉపయోగపడే సినిమాలను తీశారు.



Related Post

సినిమా స‌మీక్ష