మార్చి 2 నుండి థియేటర్లు బంద్..!

February 24, 2018


img

నిర్మాతలకు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ కు మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా తేలకపోవడంతో మార్చి 2 నుండి థియేటర్స్ బంద్ చేయడం తధ్యమని అంటున్నారు సిని పండితులు. రీళ్ల నుండి డిజిటల్ ప్రొవైడర్స్ గా మారిన సినిమాను తమ సర్వీస్ ప్రొవైడ్ చేసేందుకు అధిక ధరలు వసూలు చేస్తున్న నేపథ్యంలో నిర్మాతలు జాయింట్ యాక్షన్ కమిటీ ముందు సమస్య ఉంచారు.

ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు అధ్యక్షతన 45 మంది సభ్యులతో ఏర్పాటైన ఈ జాయింట్ యాక్షన్ కమిటీ వర్చువల్ ప్రింట్ ఫీజులను రద్దు చేయాలి లేదా కనీసం తగ్గించాలని డిమాండ్ చేశారు. యూఎఫ్‌వో, పీఎక్స్‌డీ, క్యూబ్ ద్వారా ప్రస్తుతం సినిమాలు డిజిటైలైజేషన్ పను చేస్తున్నారు. వర్చువల్ ప్రింట్ ఫీజులను వసూళు చేయమని థియేటర్ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకోగా దాన్ని ఉల్లంఘించి ఇప్పుడు చార్జీల రూపంలో నష్టం తెస్తున్నారని చెప్పారు.

కేవలం ఎగ్జిబీటర్ల నుండి కొన్ని తప్పులను ఎత్తిచూపుతూ డిజిటల్ ప్రొవైడర్స్ ఇలా చేయడం కరెక్ట్ కాదని తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు జెమిని కిరణ్ అన్నారు. అసలే మార్చి, ఏప్రిల్ లో పెద్ద సినిమాలు ఉండగా థియేటర్ లు మూసివేయడంపై ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష