తొలిప్రేమ డైరక్టర్ తో అఖిల్..!

February 23, 2018


img

అక్కినేని అఖిల్ 3వ సినిమా డైరక్టర్ కన్ ఫ్యూజన్ ఇంకా కొనసాగుతుంది. కొరటాల శివ, వంశీ పైడిపల్లి, సుకుమార్ ఇలా రేసులో అందరు ఉన్నారని తెలియగా.. ఎవరు ఫైనల్ అవుతారన్నది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా అఖిల్ డైరక్షన్ ఛాన్స్ వెంకీ అట్లూరికి ఇస్తున్నట్టు తెలుస్తుంది. తొలిప్రేమ సినిమాతో తన సత్తా చాటిన వెంకీ అఖిల్ కు కథ రాశాడట.

తొలి సినిమానే అయినా తన డైరక్షన్ టాలెంట్ తో ఇంప్రెస్ చేసి వరుణ్ తేజ్ కు మంచి హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరి ఒక్క సినిమాతోనే సూపర్ క్రేజ్ దక్కించుకున్నాడు. ఇక అఖిల్ కూడా తొలిప్రేమ చూసి డైరక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్న ఈ సినిమాపై అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. 



Related Post

సినిమా స‌మీక్ష