బిగ్ బాస్ సెట్ లో భారీ అగ్నిప్రమాదం..!

February 23, 2018


img

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ ను అన్ని రీజనల్ లాంగ్వేజెస్ కు విస్తరించారు. తెలుగులో మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ వ్యాఖ్యాతగా చేశాడు. ఇక జూన్ లో సెకండ్ సీజన్ స్టార్ట్ అవబోతుందట. ఇక తమిళంలో కమల్, కన్నడలో సుదీప్ హోస్టులుగా చేశారు. కన్నడలో ప్రస్తుతం బిగ్ బాస్ 5వ సీజన్ కోసం ఏర్పరచిన బిగ్ బాస్ సెట్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల సెట్ మొత్తం నిప్పులతో తగులబడిందని తెలుస్తుంది.

అయితే దీనివల్ల ఆస్థి నష్టమే తప్ప ఎవరికి హాని కలుగలేదని తెలుస్తుంది. బెంగళూరు శివార్లలో వేసిన ఈ సెట్ లో అనుకోకుండా మంటలు రావడం వల్ల సెట్ మొత్తం నాశనమైందట. తెల్లవారుజామున 3 గంటల ఆ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని తెలుస్తుంది. తెలుగులో బిగ్ బాస్ కోసం ఈసారి హైదరాబాద్ లో సెట్ వేస్తున్నట్టు తెలుస్తుంది. 



Related Post

సినిమా స‌మీక్ష