ఉగాదికి మెగా ట్రీట్..!

February 23, 2018


img

మార్చి 18న ఉగాది పండుగ పురస్కరించుకుని స్టార్ హీరోలు తెలుగు ప్రేక్షకులకు కానుకలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆ రోజు మెగా పవర్ స్టార్ రాం చరణ్ రంగస్థలం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో ప్లాన్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వేడుకకు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది. సుకుమార్ డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమా పల్లెటూరి ప్రేమకథగా వస్తుంది.

ఇక తెలుగు సంవత్సరాది నాడే సూపర్ స్టార్ మహేష్ కూడా కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న భరత్ అనే నేను సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నారట. మహేష్ సిఎంగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఏప్రిల్ 20న రిలీజ్ అవబోతున్న మహేష్ సినిమా టీజర్ తో సినిమా రేంజ్ ఏంటన్నది చూపించబోతున్నారు. 

డివివి దానయ్య నిర్మిస్తున్న భరత్ అనే నేను సినిమాలో బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా శ్రీమంతుడు మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని అంటున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష