'అహం బ్రహ్మస్మి' వరుణ్ కాదు వెంకటేష్..!

February 22, 2018


img

అహం బ్రహ్మస్మి అంటూ రెండు మూడు రోజులుగా ఓ సినిమా వార్తల్లో వస్తుంది. ముందు సంకల్ప్ రెడ్డి డైరక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా ఈ సినిమా వస్తుందని అంటున్నారు. కాని ఆ టైటిల్ తో సినిమా ప్లాన్ చేసింది క్రిష్ అని తెలుస్తుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా ఈ సినిమా కథ రాసుకున్నాడట క్రిష్. ప్రస్తుతం మణికర్ణిక సినిమా చేస్తున్న క్రిష్ అది పూర్తయ్యాక ఈ సినిమా చేస్తాడట.

తన ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉండేలా ప్రేక్షకులను అలరిస్తున్న క్రిష్. బాలయ్య వందవ సినిమాగా చేసిన శాతకర్ణితో తన సత్తా చాటాడు. ఇక వెంకటేష్ తో అహం బ్రహ్మస్మి కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం తేజ డైరక్షన్ లో ఆటా నాదే వేటా నాదే సినిమా చేస్తున్న వెంకటేష్ ఆ సినిమా తర్వాత క్రిష్ తో చేసే అవకాశాలున్నాయి.



Related Post

సినిమా స‌మీక్ష