చిరంజీవి జోక్యం తప్పలేదా..!

February 21, 2018


img

స్టార్ సినిమాల రిలీజ్ ఫైట్ లో ఎవరో ఒకరు తగ్గితే పర్వాలేదు కాని రానున్న ఏప్రిల్ సినిమాల ఫైట్ లో ఎవరు తగ్గేట్టు లేరు అందుకే మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకోక తప్పలేదట. మహేష్ భరత్ అనే నేను, అల్లు అర్జున్ నా పేరు సూర్య ఈ రెండు సినిమాలు ఒకే రోజున వస్తున్నాయి. దర్శక నిర్మాతల చర్చలు విఫలం కావడంతో పోటీకి సై అనేశారు. అయితే ఇద్దరు స్టార్స్ ఒకే రోజు వస్తె జరిగే నష్టం తెలిసిందే.

అందుకే ఈ సినిమాల గొడవ మెగాస్టార్ చిరంజీవి దాకా వెళ్లిందట. నా పేరు సూర్య నిర్మాతలు బన్ని వాసు, భరత్ అనే నేను డివివి దానయ్య ఇద్దరు చిరు ముందు సమస్య ఉంచారట. మరి ఈ ఇద్దరిలో ఎవరి సినిమా పైచేయి సాధిస్తుందో చూడాలి. రిలీజ్ డేట్ లేకుండానే రెండు సినిమాలు ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యాయి.



Related Post

సినిమా స‌మీక్ష