లక్కీ హీరోయిన్ పూజా హెగ్దె..!

February 21, 2018


img

డిజే భామ పూజా హెగ్దె ఖాతాలో మరో లక్కీ ఛాన్స్ వచ్చి చేరింది. ముకుంద, ఒక లైలా కోసం సినిమాలు చేసినా అంతగా గుర్తింపు తెచ్చుకోని అమ్మడు బన్ని సినిమాలో బికిని లుక్స్ తో ఇంప్రెస్ చేసేసరికి అమ్మడి అందాలకు ఫిదా అయ్యారు తెలుగు ప్రేక్షకులు. ఇక ఆ సినీఅ హిట్ అవడంతో వరుస అవకాశాలను అందుకుంటుంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం సినిమాలో నటిస్తున్న అమ్మడు ఆ తర్వాత మహేష్ 25వ సినిమాలో ఛాన్స్ పట్టేసింది.

ఇక ఇవే కాకుండా ఎన్.టి.ఆర్ త్రివిక్రం సినిమాలో కూడా పూజా హెగ్దెనే సెలెక్ట్ చేశారట. త్రివిక్రం, ఎన్.టి.ఆర్ లాంటి క్రేజీ కాంబినేషన్ లో కూడా అమ్మడు అవకాశం దక్కించుకుంది అంటే ఇక టాలీవుడ్ లో పూజా కు తిరుగులేదని చెప్పొచ్చు. మహేష్ వంశీ పైడిపల్లి సినిమాలో కూడా అమ్మడు క్రేజీ ఛాన్స్ పట్టేసింది. సో ఈ ఇయర్ లక్కీ హీరోయిన్ పూజా హెగ్దె అని ఫిక్స్ అవ్వొచ్చు.



Related Post

సినిమా స‌మీక్ష