నందమూరి 'మనం' వస్తుందా..!

February 21, 2018


img

అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి చేసిన మనం సినిమా ఎంత ప్రత్యేకమైన సినిమానో అందరికి తెలిసిందే. ఏయన్నార్ నుండి అఖిల్ వరకు అక్కినేని హీరోలంతా ఆ సినిమాలో కనిపించి అలరించారు. ఇక ఆ సినిమా తర్వాత అలాంటి సినిమా చేయాలని దగ్గుబాటి, ఘట్టమనేని, నందమూరి ఫ్యామిలీస్ ఇంట్రెస్ట్ చూపించారు. కాని కథలే దొరకట్లేదని చెబుతున్నారు కాని వారికి మనం లాంటి సినిమా చేయాలని ఉంది.

అయితే నందమూరి మనం త్వరలో తెరరూపం దాల్చునుందని తెలుస్తుంది. కళ్యాణ్ రాం లీడ్ రోల్ లో నందమూరి మనం సినిమా రాబోతుందట. ఈమధ్యనే పవన్ సాధినేని ఓ కథ చెప్పాడట. ఈ సినిమాలో మిగతా నందమూరి హీరోలు కనిపించే అవకాశాలున్నాయట. ప్రస్తుతం ఎం.ఎల్.ఏ, నా నువ్వే సినిమాలు చేస్తున్న కళ్యాణ్ రాం ఆ తర్వాత పవన్ సినిమాపై దృష్టి పెడతాడట. ఎన్.టి.ఆర్, హరికృష్ణ ఈ సినిమాలో ఉంటారట. మరి నందమూరి మనం ఎలాంటి ట్రీట్ ఇస్తుందో చూడాలి. 



Related Post

సినిమా స‌మీక్ష