ఎన్టీఆర్, విజయ్, రాజమౌళి.. సైబర్ నేరాలపై అవగాహన..!

February 21, 2018


img

సమాజంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాల పట్ల తమ వంతు బాధ్యతగా సిని తారలు ప్రజలను జాగ్రత్త పరచేందుకు ముందుకొస్తారు. రోడ్డు బధ్రతా, డ్రంక్ అండ్ డ్రైవ్, సేఫ్ జర్నీ ఇలా ప్రజలకు ఉపయోగపడే మాట అది సెలబ్రిటీస్ చెబితే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ప్రభుత్వం వారి ద్వారా విషయాన్ని చెప్పిస్తుంది. ఇక ఇప్పుడు మారిన సోషల్ విప్లవం వల్ల ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ అంటూ ఆన్ లైన్ లోనే మనిషి జీవితం సాగిస్తున్నాడు.

ఆన్ లైన్ లో కూడా ప్రజలు మోసపోతున్నారు.. దీనిపై అవగాహన కల్పించేందుకు సైబర్ క్రైం టీం సినితారలు ఎన్.టి.ఆర్, విజయే దేవరకొండ, ప్రముఖ దర్శకుడు రాజమౌళితో ఓ వీడియో మెసేజ్ ఇప్పించారు. మోసగాళ్లు వారి మాయమాటలు ఎలా ఉంటాయో ఆన్ లైన్ ద్వారా ఎలా మన డబ్బు లూటి చేస్తారో అని చిన్న వీడియో క్లిప్స్ ద్వారా చూపించారు.

వ్యక్తిగత సమాచారం ఆన్ లైన్ లో ఉంచొద్దని ఎన్టీఆర్ :

మనకు సంబందించిన ఎలాంటి వ్యక్తిగత సమాచారం (ఫోటోస్, వీడియోస్)లాంటివి అపరిచిత వ్యక్తులకు పంపించడం లాంటివి వద్దని.. అవి అనర్ధాలకు దారి తీస్తుందని చెప్పాడు ఎన్.టి.ఆర్.

ఆన్ లైన్ మాట్రిమొనీ మోసాలతో విజయ్ :

మ్యాట్రిమొనీ మోసాలతో ప్రజల నుండి డబ్బులు ఎలా లూటీ చేస్తున్నారో తెలిసేలా ఈ వీడియో ఉంది. కేవలం ప్రొఫైల్ పిక్, సాలరీ చూసి కాదు.. ముందు అక్కడ అసలు మనిషి ఉందా లేదా అన్నది చూసి కమిట్ అవ్వండని విజయ్ చెప్పారు.

జాబ్ కు టాలెంట్ కావాలి డబ్బు కాదు :

మీ రెస్యూం చూశాం మీరు మా కంపెనీలో జాబ్ కు సెలెక్ట్ అయ్యారు.. అంటూ కాల్ వచ్చి విసా అరేంజ్మెంట్స్ మేం చూసుకుంటాం.. మీరు డబ్బులు సెండ్ చేస్తే చాలు అంటే.. జాబ్ చేయాలన్న ఆలోచనలో డబ్బులు లాస్ అవడం గురించి దర్శకుడు రాజమౌళి మెసేజ్ ఇచ్చాడు. 

ఇక ఇలాంటివి జరుగకుండా ముందే జాగ్రత్త పడాలని.. ఒకవేళ జరిగినా సైబర్ క్రైం స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలని సూచించారు. టెక్నాలజీని అడ్డుపెట్టుకుని సైబర్ నేరగాళ్లు చేస్తున్న ఈ దుర్మాగాలను ఆపేలా సైబర్ క్రైం టీం గట్టి చర్యలు చేపట్టింది. 





Related Post

సినిమా స‌మీక్ష