అ!శ్చర్యపరచేలా అమెరికా కలక్షన్స్..!

February 17, 2018


img

నాచురల్ స్టార్ నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో చేసిన సినిమా అ!. కాజల్, రెజినా, నిత్యా మీనన్, ఈషా రెబ్బ, అవసరాల శ్రీని, ప్రియదర్శి, మురళి శర్మ ఇలా భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నుండి ఇదో ప్రయోగాత్మకమైన సినిమా అని చెప్పుకొచ్చిన నాని అందుకు తగినట్టుగానే రెస్పాన్స్ అందుకున్నాడు.  

ఇక యూఎస్ లో ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. ఒకరోజు ముందే ప్రీమియర్స్ తో సందడి చేసిన అ! సినిమా అక్కడ ఊహించని విధంగా కలక్షన్స్ రాబట్టింది. ఇప్పటివరకు 107612 డాలర్ల వసూళ్లను రాబట్టిన అ! అక్కడ ఆడియెన్స్ కు బాగా నచ్చిందని చెప్పొచ్చు. నిర్మాతగా నాని ఇలాంటి సినిమా తీయడం అందరి నుండి ప్రశంసలు అందుకుంటున్నాడు. మొదటి రోజే ఈ సినిమా కోటిన్నర నుండి 2 కోట్ల దాకా వసూళ్లను రాబట్టిందని తెలుస్తుంది.  



Related Post

సినిమా స‌మీక్ష