బిగ్ బాస్-2 ఎన్టీఆర్ కష్టమేనా..!

February 17, 2018


img

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా తెలుగు బిగ్ బాస్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే. స్టార్ మాలో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ రియాలిటీ షో ఎన్.టి.ఆర్ హోస్టింగ్ వల్ల స్పెషల్ ఎట్రాక్షన్ లో నిలిచింది. టి.ఆర్.పి రేటింగ్ లతో హుశారెత్తించేలా చేసిన ఎన్.టి.ఆర్ బిగ్ బాస్ సీజన్ 2కి హోస్ట్ గా చేస్తాడని అనుకున్నారు. కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్-2 నుండి ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేసే అవకాశం లేదట.

త్రివిక్రం, రాజమౌళి సినిమాలు కమిట్ అవడంతో షెడ్యూల్ బిజీ వల్ల తారక్ బిగ్ బాస్-2 నుండి ఎక్సిట్ అయ్యాడట. రాజమౌళి సినిమా కోసం వర్క్ షాప్ చేయాల్సి ఉందట. అందుకోసం టైటి షెడ్యూల్ ఉంటుందని తెలుస్తుంది. అయితే బిగ్ బాస్-2 హోస్ట్ గా తారక్ కాకుండా ఎవరు చేస్తారు అన్న విషయం మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.  



Related Post

సినిమా స‌మీక్ష