పోలీస్ స్టేషన్ లో వర్మ..!

February 17, 2018


img

వర్మ తీసిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జిఎస్టి) వెబ్ సెరీస్ వివాదాలు అందరికి తెలిసిందే. సినిమాగా చెప్పలేని విషయాలెన్నో వెబ్ సీరీస్ గా విపులీకరించి చెప్పేశాడు ఆర్జివి. ఇక ఈ వెబ్ సీరీస్ పై తెలుగు ఛానెల్స్ లో ఇంటర్వ్యూలు గట్రా చేశారు. అయితే ఈ క్రమంలో మహిళా లోకల్ తరపున ప్రముఖ సామాజిక ఉద్యమ కారిణి దేవి కూడా వర్మతో మాటల యుద్ధానికి దిగారు. 

వర్మ వర్సెస్ దేవి లైవ్ లోనే ఇద్దరు పోట్లాడారు. ఇందుకు గాను తనపై చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పోలీసులను ఆశ్రయించింది. దేవి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆర్జివిపై రెండు కేసులు నమోదు చేయడం జరిగిందట. సెక్స్ ప్రధానాంశంగా వెబ్ సీరీస్ తెరకెక్కించడం దాని పై ఒక కేసు అయితే.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరో కేసు పెట్టారట.

హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వర్మను విచారణకు రమ్మని నోటీసులు పంపించగా తాను షూటింగ్ లో ఉన్నానని.. హజారు కావడం కుదరదని చెప్పాడు. అయితే కొన్నాళ్లు టైం ఇచ్చిన పోలీసులు ఈసారి గట్టి పట్టు పట్టారు. ఈసారి నోటీసులు పంపించి విచారణకు రాకుంటే అరెస్ట్ వారెంట్ ఇస్తామని అన్నారట. అందుకే వర్మ ఈరోజు పోలీసుల విచారణకు అటెండ్ అయ్యారు. ఆయన తరపున న్యాయవాదిని కూడా వర్మ తన వెంట తెచ్చుకున్నాడు. అయితే సోషల్ మీడియాలో మాత్రం వర్మ అరెస్ట్ పక్కా అంటూ వార్తలు రాస్తున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష