మరోసారి మామా కోడళ్ళు కలిసి..!

February 17, 2018


img

కింగ్ నాగార్జున నాచురల్ స్టార్ నాని కలిసి ఓ క్రేజీ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారని తెలిసిందే. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున డాన్ గా.. నాని డాక్టర్ గా నటిస్తున్నారట. అయితే ఈ సినిమా లో నానికి జోడిగా సమంతను ఫైనల్ చేశారట. అక్కినేని కోడలుగా అయ్యాక నాగార్జునతో రాజు గారి గది-2 చేసిన సమంత మరోసారి మామయ్య సినిమాలో నటిస్తుంది.

ఇక నాగార్జునకు కన్నడ భామ శ్రద్ధ శ్రీనాద్ నటిస్తుందట. రేసీ స్క్రీన్ ప్లేతో డిఫరెంట్ సబ్జెక్ట్ తో ఈ సినిమా రాబోతుందని అంటున్నారు. సినిమా కథ కథనాలు అన్ని కొత్తగా ఉంటాయట. ఫాం లో ఉన్న నాని, నాగార్జునతో కలిసి చేసే ఈ మల్టీస్టారర్ కచ్చితంగా సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. మరి ఆ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష