భాగమతి డైరక్టర్ కు బంపర్ ఆఫర్..!

February 17, 2018


img

2018 సంవత్సరంలో అసలు సిసలు నికార్సైన హిట్ అందించిన బాక్సాఫీస్ ను షేక్ చేసేలా వచ్చిన సినిమా భాగమతి. యువి క్రియేషన్స్ బ్యానర్లో స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా అనుష్కను మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కించింది. భాగమతి డైరక్టర్ గా అశోక్ అందరికి తన సత్తా ఏంటో చూపించాడు. ఇక ఈ సక్సెస్ ఫుల్ డైరక్టర్ కు భాగమతి సక్సెస్ తర్వాత క్రేజీ ఆఫర్లు వస్తున్నాయట. 

ప్రస్తుతం నాగార్జునకు కథ రెడీ చేసుకున్న అశోక్ కథ వినిపించగా నాగార్జున ఓకే అన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆర్జివి గన్ సినిమాలో నటిస్తున్న నాగార్జున ఆ తర్వాత నానితో మళ్టీస్టారర్ చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత అశోక్ డైరక్షన్ లో సినిమా ఉంటుందట. పిల్లజమిందార్ తర్వాత మళ్లీ భాగమతితో తన టాలెంట్ ప్రూవ్ చేస్తున్న అశోక్ కు నాగార్జున ఆఫర్ అంటే వెరీ లక్కీ అని చెప్పొచ్చు.



Related Post

సినిమా స‌మీక్ష