ప్రియా ఇక్కడ ఛాన్స్ పట్టేసిందిగా..!

February 16, 2018


img

లక్ కు కేరాఫ్ అడ్రెస్ అంటే అది కచ్చితంగా మలయాళ భామ ప్రియా వరియర్ దే అని చెప్పేయొచ్చు. ఒరు అదార్ లవ్ సినిమా టీజర్ తో భాషతో సంబంధం లేకుండా కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన ఈ అమ్మడు కోట్ల కొద్ది ఫాలోవర్స్ ను సంపాదించింది. ఇక ఈ క్రేజ్ నే క్యాష్ చేసుకునేందుకు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఓవర్ నైట్ సూపర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడికి టాలీవుడ్ నుండి లక్కీ ఆఫర్ పలుకరించింది.

పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటిన తరుణ్ భాస్కర్ సెకండ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. నిఖిల్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఫ్రెష్ లుక్ కోసం చూస్తుంటే ప్రియా కనబడింది. ఆమెని చూసి ఇంప్రెస్ అయిన తరుణ్ వెంటనే ఆమెను హీరోయిన్ గా ఫైనల్ చేశారట. ఆ తర్వాత చర్చలు జరగడం ఆమె కన్ఫాం అవడం జరిగింది. మొత్తానికి సినిమా టీజర్ తో మరో ఆఫర్ తెచ్చుకోవడం అంటే కచ్చితంగా ప్రియ లక్ ఓ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు.



Related Post

సినిమా స‌మీక్ష