దుమ్మురేపుతున్న బన్ని బిజినెస్..!

February 16, 2018


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరక్షన్ లో వస్తున్న సినిమా నా పేరు సూర్య. యాంగ్రీ సోల్జర్ గా టీజర్ తో దుమ్మురేపిన బన్ని ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా దూసుకెళ్తున్నాడు. 70 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో 80 కోట్ల దాకా బిజినెస్ చేసిందట. నైజాంలోనే 22 కోట్ల దాకా బిజినెస్ అయ్యిందట. బన్ని కెరియర్ లో ఈ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం ఇదే మొదటిసారి. 

బన్ని సినిమా యావరేజ్ టాక్ వచ్చినా సూపర్ హిట్ కలక్షన్స్ సాధిస్తాయి. దాని ఉదాహరణగా లాస్ట్ ఇయర్ వచ్చిన దువ్వాడ జగన్నాధం చెప్పుకోవచ్చు. ఇక నా పేరు సూర్య సినిమాకు వస్తే.. దాదాపు ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లు టచ్ చేసేలా ఉందట. సీడెడ్, ఆంధ్రాలో కూడా బొమ్మకు బాగానే రేటు వస్తుందట. ప్రీ రిలీజ్ బిజినెస్ తో హంగామా సృష్టిస్తున్న బన్ని ఆఫ్టర్ రిలీజ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. 



Related Post

సినిమా స‌మీక్ష