అ!..ఇది మరి విచిత్రం..!

February 15, 2018


img

నాచురల్ స్టార్ నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా అ!. నాని నిర్మాతగా మొదటి ప్రయత్నం చేస్తున్న ఈ అ! సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సినిమా చూసిన సెలబ్రిటీస్ సూపర్ అంటున్నారు. పాత్ బ్రేకింగ్ సినిమా అంటూ ప్రశంసలు అందిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న స్టార్స్ మాత్రం ఇప్పటికి ఈ సినిమా పూర్తి కథ తమకు తెలియదని చెప్పడమే.

లీడ్ రోల్ చేసిన కాజల్, రెజినా, నిత్యా మీనన్, ఈషా రెబ్బ ఇలా అందరు ప్రమోషన్స్ లో పాల్గొన్నా సినిమా పూర్తి కథ మాత్రం మాకు తెలియదని.. అది సినిమా చూసే థ్రిల్ అవుతామని అంటున్నారు. ఎవరి క్యారక్టర్ వారికి చెప్పారని.. అలానే చేశామని అన్నారు. ఒకవేళ చెప్పాలని అలా చెబుతున్నా సినిమా మాత్రం కచ్చితంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని మాత్రం చెబుతున్నారు. మరి ఊరిస్తున్న ఈ అ! సినిమా అసలు మ్యాటర్ ఏంటో మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది. 

 


Related Post

సినిమా స‌మీక్ష