కాలా లీక్.. ఏంటి రభస..!

February 13, 2018


img

సూపర్ స్టార్ రజినికాంత్ పా. రంజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా కాలా. కబాలి తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. రజిని అల్లుడు ధనుష్ నిర్మిస్తున్న ఈ సినిమా నుండి క్లైమాక్స్ ఫైట్ సీన్ లీక్ అయ్యింది. ఇది ఎవరి పని అన్నది తెలియదు కాని ఏకంగా యూట్యూబ్ లో కాలా ఫైట్ సీన్ ను అప్లోడ్ చేశారు. ఇది కచ్చితంగా చిత్రయూనిట్ లో ఎవరో ఒకరు చేశారని భావిస్తున్నారు.

రజిని 2.ఓ సినిమా పోస్ట్ పోన్ కావడంతో కాలా సినిమాను ముందుకు తెస్తున్నారు. ఏప్రిల్ 27న కాలా రిలీజ్ కానుందని నిర్మాత ధనుష్ ప్రకటించారు. ఈ సినిమాలో రజినికాంత్ డాన్ గా కనిపించనున్నాడు. కాలా లీక్ పై చిత్రయూనిట్ ఎలాంటి స్పందన రాలేదు. కోలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా కాలా మూవీపై బీభత్సమైన క్రేజ్ పెరిగింది. కబాలి మిస్సైన టార్గెట్ ఈ కాలాతో కొట్టాలని చూస్తున్నారు.Related Post

సినిమా స‌మీక్ష