వినాయక్ తిరిగిచ్చేశాడా..!

February 13, 2018


img

వి.వి.వినాయక్ డైరక్షన్ లో మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా వచ్చిన సినిమా ఇంటిలిజెంట్. సి. కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. లాస్ట్ ఫ్రై డే రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. 30 కోట్ల పైగా బడ్జెట్ తో తెర్కెక్కిన ఈ సినిమా 40 కోట్ల దాకా బిజినెస్ జరిగింది. అయితే సినిమాకు ఇప్పటివరకు 15 కోట్లలోపే కలక్షన్స్ వచ్చాయి.

ఇక ఈ సినిమా ఫ్లాప్ బాధ్యతను మోస్తున్న వినాయక్ తన వంతుగా డిస్ట్రిబ్యూటర్స్ నష్టాన్ని కొంత భరిస్తానని హామి ఇచ్చాడట. ఇంటిలిజెంట్ సినిమాకు దాదాపు 9 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్న వినాయక్ 5 కోట్ల దాకా తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడట. అఖిల్ సినిమా టైంలో కూడా రెమ్యునరేషన్ ఇచ్చేయడంతో పాటుగా ఆ డిస్ట్రిబ్యూటర్స్ కే ఖైది నంబర్ 150 వచ్చేలా చేశాడు. ఇక ప్రస్తుతం స్టార్స్ అంతా ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉండగా.. ఫ్లాపుల్లో ఉన్న వినాయక్ తో సినిమా తీయడం అంటే సాధ్యపడే విషయం కాదని చెప్పొచ్చు.  Related Post

సినిమా స‌మీక్ష