మంత్రిగారికి తొలిప్రేమ నచ్చేసింది..!

February 12, 2018


img

వెంకీ అట్లూ డైరక్షన్ లో వరుణ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటించిన సినిమా తొలిప్రేమ. బోగవల్లి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా చూసిన తెలంగాణా ఐటి, పంచాయితిరాజ్ శాఖ కేటిఆర్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. తెలుగులో చాలా కాలం తర్వాత ఓ సున్నితమైన ప్రేమకథ చూశానని.. లీడ్ పెయిర్ నటన.. డైరక్షన్.. తమన్ మ్యూజిక్.. సినిమాటోగ్రఫీ అన్ని బాగున్నాయని అన్నారు.

ఇక కేటిఆర్ చిత్రయూనిట్ కు అందించిన విషెష్ కు వారు కూడా రెస్పాన్స్ అందించారు. తనకు నచ్చిన సినిమాపై ట్వీట్ వేయడంలో నిమిషం కూడా ఆలోచించని కేటిఆర్ తొలిప్రేమ సినిమా గురించి వేసిన ట్వీట్ పై రాజకీయ వర్గాల నుండి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే దానికి తగినట్టుగానే మంత్రి గారు సరైన రెస్పాన్స్ అందించారు.   Related Post

సినిమా స‌మీక్ష