పాపం లావణ్య ఇది కూడా పాయే..!

February 12, 2018


img

అందాల రాక్షసిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన లావణ్య త్రిపాఠి హోమ్లీ లుక్ లో ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత అమ్మడు మంచి అవకాశాలే అందుకుంది. శ్రీరస్తు శుభమస్తు సినిమాతో హిట్ అందుకున్న లావణ్య ఆ తర్వాత అన్ని వరుస ఫ్లాపులు కొట్టేస్తుంది. అసలే అరకొర అవకాశాలు వస్తున్న ఈ టైంలో సాయి ధరం తేజ్ సరసన ఇంటిలిజెంట్ మూవీలో నటించింది లావణ్య.  

ఆ సినిమాపైనే అన్ని అంచనాలు పెట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాలో అమ్మడు కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచింది. అయినా ఏమాత్రం లాభం లేకుండా పోయింది. తేజూ కెరియర్ లో డిజాస్టర్ కా బాప్ అనిపించుకున్న ఇంటిలిజెంట్ మూవీ లావణ్యకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. మరి అమ్మడు ఇక తెలుగులో స్టార్ ఇమేజ్ దక్కించుకోవడం కష్టమేనని చెప్పొచ్చు. Related Post

సినిమా స‌మీక్ష