'గన్' కే ఓటేసిన నాగార్జున..!

February 12, 2018


img

కింగ్ నాగార్జున సంచలన దర్శకుడు రాం గోపాల వర్మ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు ఇన్నాళ్లు శపథం అన్న టైటిల్ వినిపించింది. అయితే నాగార్జున మాత్రం ఈ సినిమాకు గన్ అనే టైటిల్ బాగుంటుందని రికమెండ్ చేశాడట. గన్, సిస్టెం, శపథం ఈ మూడు టైటిల్స్ ఈ సినిమాకు ప్రచారంలో ఉన్నాయి. నాగార్జున మాత్రం గన్ అన్నదానికి లాక్ అయినట్టు తెలుస్తుంది. సినిమా కంటెంట్ పరంగా అదయితేనే పర్ఫెక్ట్ అని నాగ్ అభిప్రాయపడుతున్నాడట.

వర్మ దర్శక నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో మైరా సరీన్ హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు 28 ఏళ్ల తర్వాత వర్మతో నాగార్జున చేస్తున్న సినిమా ఇది. ఇందులో నాగ్ ఎంకౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపిస్తాడట. ఇప్పటికే సినిమా నుండి వదిలిన నాగ్ రఫ్ లుక్ అక్కినేని ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మరి ఈ సినిమా అసలు టైటిల్ ఏదవుతుంది అన్నది త్వరలో తెలుస్తుంది. 

నాగార్జున ఈ సినిమా తర్వాత నానితో మల్టీస్టారర్ చేస్తున్నాడు. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో తెరకెక్కే ఆ సినిమాలో నాగార్జున డాన్ క్యారక్టర్ లో కనిపిస్తారట. ఇక ఇదే కాకుండా కోలీవుడ్ హీరో ధనుష్ దర్శక నిర్మాణంలో కూడా నాగార్జున నటిస్తాడని తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష