ఛలో డైరక్టర్ సెకండ్ ఛాన్స్..!

February 12, 2018


img

నాగ శౌర్య హీరోగా కన్నడ భామ రష్మిక మందన హీరోయిన్ గా నటించిన సినిమా ఛలో. వెంకీ కుడుముల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా సూపర్ సక్సెస్ అయ్యింది. సినిమా రిలీజ్ అయిన వారంలోనే లాభాల పాట పట్టిన ఈ సినిమా డైరక్టర్ వెంకీకి మరో లక్కీ ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. త్రివిక్రం అసిస్టెంట్ గా పనిచేసిన వెంకీ మొదటి సినిమాతోనే సత్తా చాటాడు.

ఇక ఇతని టాలెంట్ మెచ్చిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ ఇతని సెకండ్ మూవీకి అడ్వాన్స్ ఇచ్చాడట. తన దగ్గర ఇప్పటికే రెండు బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయని చెప్పిన వెంకీ యువ హీరోతో సినిమా చేస్తాడని తెలుస్తుంది. హారిక & హాసిని క్రియేషన్స్ అంటే కచ్చితంగా కచ్చితంగా వెంకీకి మంచి ఛాన్స్ అన్నట్టే. సెకండ్ మూవీ కూడా హిట్ కొడితే తెలుగులో మరో టేస్ట్ ఉన్న డైరక్టర్ దొరికినట్టే. Related Post

సినిమా స‌మీక్ష