త్రివిక్రం కథపై రచయిత స్పందించాడు..!

February 12, 2018


img

అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రం శ్రీనివాస్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా కథ నవలా రచయిత మధుబాబు రాసిన షాడో నవల ఆధారంగా తెరకెక్కుతుందని అంటున్నారు. అయితే ఈ విషయంపై రచయిత మధుబాబు క్లారిటీ ఇచ్చారు. చిత్రయూనిట్ తన కథను వాడుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు.

సినిమాకు తను కథ అందిస్తున్నానని వచ్చిన వార్తలను కొట్టి పడేశారు. ఇదవరకే యద్ధనపూడి సులోచనరాణి మీరా స్పూర్తితో అఆ సినిమా తీసిన త్రివిక్రం ఇప్పుడు మధుబాబు షాడో నవల ఆధారంగానే తారక్ సినిమా చేస్తున్నాడని అన్నారు. ఫైనల్ గా ఆ రైటరే వచ్చి క్లారిటీ ఇచ్చాడు కాబట్టి ఈ వార్తలకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పడినట్టే లెక్క. Related Post

సినిమా స‌మీక్ష