నాని అ!.. యు/ఏ..!

February 10, 2018


img

నాచురల్ స్టార్ నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా అ!. కాజల్, రెజినా, నిత్యా మీనన్, ఈషా రెబ్బ, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి, మురళి శర్మ.. ఈ సినిమాలో నటించే ప్రతి పాత్రకు సినిమా కథతో లింక్ ఉంటుందట. అందుకే ప్రపంచంలో నేను.. నాలోనే ప్రపంచం అంటూ ఓ నోట్ తో అ! సినిమా మీద ఇంప్రెషన్ కలిగేలా చేశాడు డైరక్టర్ ప్రశాంత్ వర్మ.

ఫిబ్రవరి 16న రిలీజ్ అవుతున్న ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సెన్సార్ నుండి ఈ సినిమా యు/ఏ సర్టిఫికెట్ అందుకున్నట్టు తెలుస్తుంది. ఇక సినిమాలో నాని చేపగా, రవితేజ మొక్కగా వాయిస్ ఓవర్స్ ఇస్తున్నారు. టీజర్, ట్రైలర్ తో సినిమాపై ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన నాని సినిమా ఫలితం మీద నమ్మకంతో ఉన్నాడు. హీరోగా వరుస సక్సెస్ లను అందుకుంటున్న నాని నిర్మాతగా ఎలాంటి టేస్ట్ ఉందో చూడాలి.  

Related Post

సినిమా స‌మీక్ష