భాగమతి రివ్యూ & రేటింగ్

January 26, 2018


img

రేటింగ్ : 2.75/5

కథ :

ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ అయిన చెంచల (అనుష్క) తను ప్రేమించిన  విషయమై కష్టడీలో ఉంటుంది. మంత్రి ఈశ్వర్ (జయరాం) గురించి తెలుసుకునే క్రమంలో ఆమెను ఓ ప్రైవేట్ ప్లేస్ లో ఇంటరాగేషన్ చేయాలని చూస్తారు. ఈ క్రమంలో చెంచలను ఓ పాడుబడ్డ బంగ్లాలో ఇంటగారేట్ చేయాలని చూస్తారు. అయితే అక్కడ నైట్ అయితే చెంచలకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆమెలోకి భాగమతి ప్రవేశించినట్టుగా ప్రవర్తిస్తుంది. అసలు ఇంతకీ భాగమతి ఎవరు..? చెంచల ఎందుకు ఇదంతా చేస్తుంది..? ఫైనల్ గా ఈశ్వర్ అసలు స్వరూపం ఏంటి..? అన్నదే సినిమా కథ. 

విశ్లేషణ :

భగమతి.. అనుష్క లీడ్ రోల్ లో వచ్చే ఇలాంటి సినిమాలు భారీ క్రేజ్ తో వస్తాయి. ఎందుకంటే ఆమె చేసిన అరుంధతి సినిమా తాలూఖా అంచనాలు ఈ సినిమాపై కూడా ఉంటాయి. అయితే ఆ అంచనాలు అందుకోవడంలో భాగమతి సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా భాగమతి కథ ఎలా ఉన్నా కథనం మాత్రం డైరక్టర్ అశోక్ గ్రిప్పింగ్ తో తెరకెక్కించాడు.

కథనం లో ఎక్కడ లాజిక్ మిస్ అవ్వలేదు. అయితే సినిమా కథ మాత్రం పాతదే అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండు భాగాలు అలరించాయి. ముఖ్యంగా ఇంటర్వల్ బ్యాంగ్ మాత్రం అదిరిపోయింది. అయితే కథ దృష్ట్యా రాజు గారి గది సినిమాకు దగ్గర పోలికలు ఉన్నట్టు కనిపిస్తుంది. సినిమాలో డైరక్టర్ అశోక్ బ్రిలియన్స్ తెలుస్తుంది. ఏ చిన్న పాయింట్ ను మిస్ అవ్వకుండా క్లియర్ గా మెన్షన్ చేశాడు.

భారీ సెట్స్, గ్రాఫిక్స్ సినిమాకు విజువల్ ట్రీట్ ఇచ్చేలా చేశాయి. భాగమతి అనుష్క మాత్రమే చేయగల సినిమా అని చెప్పేయొచ్చు. ఎంటర్టైన్మెంట్ పాళ్లు కాస్త తగ్గినట్టు అనిపించినా కథనం తో దాన్ని ఆకట్టుకున్నాడు.

నటన, సాంకేతికవర్గం :

అనుష్క లీడ్ రోల్ సినిమా అనగానే ఊహకి వచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. నటనలో అనుష్క మరోసారి తన సత్తా చాటింది. ఇంటర్వల్ సీన్స్ లో బాగా చేసింది. ఇక ఈశ్వర్ పాత్ర చేసిన జయరాం చివరి దాకా మంచిగా నటిస్తూ అలరించాడు. ఆషా శరత్, మురళి శర్మ ఆకట్టుకున్నారు. ఉన్ని ముకుందన్ కూడా తన పాత్రతో అలరించాడు. 

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. సినిమాకు కావాల్సినంత గ్రాండియర్ అంతా టెక్నికల్ సపోర్ట్ తో ఇచ్చారు. మథి సినిమాటోగ్రఫీ సూపర్ అనేలా ఉండగా.. తమన్ మ్యూజిక్ అదిరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో తమన్ ది బెస్ట్ అనిపించుకున్నాడు. ఇక విజువల్ పరంగా కూడా బాగుంది. గ్రాఫిక్స్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. యువి క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాకు ఎంత పెట్టాలో అంతా పెట్టేశారు.

ఒక్కమాటలో :

అనుష్క భాగమతి.. ఆకట్టుకుంది..!


Related Post

సినిమా స‌మీక్ష