చరణ్ సినిమాలో తమిళ హీరో..!

January 20, 2018


img

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న ముహుర్తం పెట్టేశారు. కియరా అద్వాని హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కోలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో ప్రశాంత్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. బోయపాటి సినిమాలో హీరోకి ఏమాత్రం తీసి పోకుండా విలన్లు ఉంటారు. అయితే ప్రశాంత్ ఉంటున్నాడు అంటే కచ్చితంగా అతనే విలన్ అయ్యుంటాడని తెలుస్తుంది.

ప్రశాంత్ తో పాటుగా సినిమాలో స్నేహ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందట. ముహుర్తం టైంకే కాస్ట్ అండ్ క్రూతో పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్న ఈ సినిమా అనుకున్న టైం కల్లా పూర్తి చేస్తారని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం రంగస్థలం పూర్తి చేసే పనిలో ఉన్న రాం చరణ్ బోయపాటి సినిమా తర్వాత రాజమౌళి మెగా నందమూరి మల్టీస్టారర్ కు సిద్ధమవ్వాల్సి ఉంది.



Related Post

సినిమా స‌మీక్ష