మహేష్ రికార్డులు మొదలయ్యాయి..!

January 20, 2018


img

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ భరత్ అనే నేను అని ప్రచారం లో ఉన్న సంగతి తెలిసిందే. కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. సినిమాలో మహేష్ మహేష్ సిఎంగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అవని ఈ సినిమా శాటిలైట్ రూపంలో రికార్డులు సృష్టిస్తుంది.  

మహేష్ సినిమా అంటే రిజల్ట్ తో సంబంధం లేకుండా బిజినెస్ జరుగుతుంది. బ్రహ్మోత్సవం, స్పైడర్ ఫ్లాపులు కనిపిస్తున్నా సరే మహేష్ సినిమా కోసం ఎగబడుతున్నారు. ఇక భరత్ అనే నేను సినిమా శాటిలైట్ రైట్స్ స్టార్ మా వారు 39 కోట్లతో డీల్ సెట్ చేసుకున్నారట. అందులో తెలుగు వర్షన్ 23 కోట్లు, హింది వర్షన్ కు 16 కోట్లని తెలుస్తుంది. కేవలం శాటిలైట్ రూపంలోనే 39 కోట్లంటే మహేష్ భరత్ అనే నే టార్గెట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష