ఈ విషయంలో మహా న్యూస్ ను మెచ్చుకోవాల్సిందే..!

January 20, 2018


img

మహేష్ కత్తి వర్సెస్ పవన్ ఫ్యాన్స్ వివాదానికి మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. గత రాత్రి మహేష్ పై కోడి గుడ్ల దాడి చేయగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు కత్తి మహేష్. ఇక నిన్న ఉదయం టివి-9 స్టూడియోలో సంధి కుదిర్చే ప్రయత్నం చేయగా.. ఫైనల్ గా నిన్న రాత్రి మహా న్యూస్ లో కత్తి మహేష్ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు.

ప్రైం టైం విత్ మూర్తిలో పవన్ కళ్యాణ్ అభిమాని.. జనసేన కార్యకర్త కళ్యాణ్ దిలీప్ సుంకర, కత్తి మహేష్ ఇద్దరు సంధి కుదుర్చుకున్నారు. కత్తిపై దాడికి రెస్పాన్స్ అవుతూ సమ్యనం పాటించాలంటూ జనసేన పార్టీ కార్యాలయం నుండి ఓ బహిరంగ లేఖ మీడియాకు రిలీజ్ చేశారు. ప్రెస్ నోట్ రావడంతో కాస్త వెనక్కి తగ్గిన మహేష్ కత్తి ఫైనల్ గా మహా న్యూస్ లో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు.

ఆ తర్వాత ఫిల్మ్ నగర్ రెస్టారెంట్ లో కత్తి మహేష్ తో కలిసి పవన్ ఫ్యాన్స్ సెల్ఫీ కూడా దిగడం జరిగింది. ఇన్నాళ్లు ఈ చర్చను కొనసా... గిస్తూ చర్చా వేదికలు జరిపిన ప్రముఖ ఛానెల్స్ కంటే.. మహా న్యూస్ స్టూడియోలో ఈ వివాదానికి పరిష్కారం దొరకడం అందరిని ఆశ్చర్యపరచింది. Related Post

సినిమా స‌మీక్ష