అజ్ఞాతవాసికి షాక్ ఇచ్చిన ఆ డైరక్టర్..!

January 19, 2018


img

పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా అంచనాలను అందుకోలేదు. సినిమా రిలీజ్ కు ముందు ఈ సినిమా హాలీవుడ్ సినిమా లార్గో వించ్ కు స్పూర్తి అన్నారు. కాని సినిమా చూశాక తెలిసింది. ఆ సినిమా మక్కీకి మక్కీ దించేశారని.. సినిమా చూస్తున్నట్టు.. చూసినట్టు ట్వీట్ చేసిన లార్గో వించ్ అసలు డైరక్టర్ జెరోం సల్లే. తన కథను తన కన్నా మారే బాగా తీశారని.. కళాత్మకంగా కాపీ కొట్టారు.. అందుకే మిమ్మల్ని అభినందించకుండా ఉండలేనని ట్వీట్ చేశాడు.

అంతేకాదు అజ్ఞాతవాసి టీం ఎవరు అతని ట్వీట్స్ కు రిప్లై ఇవ్వకపోవడంతో ఈసారి లీగల్ యాక్షన్ దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడట. దాదాపు అజ్ఞాతవాసి సినిమా మీద 100 కోట్ల పైగా పరువునష్టం దావా వేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఈ సినిమా ఓవర్సీస్ లో అంత భారీగా రిలీజ్ చేయడం వల్లే తనకు కోపం తెప్పించినట్టు తెలుస్తుంది. ఇండియన్ మార్కెట్ లో లార్గో వించ్ రైట్స్ కొనేసిన టీ సీరీస్ ను సైలెంట్ గా ఉంచినా ఇప్పుడు అసలు మేకర్ అజ్ఞాతవాసిపై గరం గరంగా ఉన్నాడు. 



Related Post

సినిమా స‌మీక్ష