పవన్ నోరు విప్పే టైం వచ్చిందా..!

January 19, 2018


img

పవన్ కళ్యాణ్ అభిమానులు చేస్తున్న పనుల వల్ల తనకు చెడ్డ పేరు వస్తుందని కొందరు భావిస్తున్నారు. ఏకంగా కత్తి మహేష్ అనే క్రిటిక్ ను సెలబ్రిటీ చేసింది కచ్చితంగా పవన్ అభిమానులే. ఇక ఈమధ్య కత్తి వర్సెస్ పవన్ ఫ్యాన్స్ వివాదం ఎంత తీవ్రస్థాయికి చేరిందో తెలిసిందే. ఈ టైంలో అజ్ఞాతవాసి సినిమా బాగాలేదని పవన్ పోస్టర్ ను చెప్పుతో కొట్టిన కుర్రాడిని పవన్ ఫ్యాన్స్ చితకబాదారు.

అయితే అతగాడు చేసింది తప్పే అయినా చివర్లో ఈసారి పవన్ కళ్యాణ్ జోలికి వస్తే ఇదే గతి అని వార్నింగ్ ఇచ్చారు. మరోపక్క కత్తి మహేష్ పై కూడా నిన్న రాత్రి కోడి గుడ్లతో దాడి చేశారు. కత్తి మహేష్ పై కోడి గుడ్లు వేసేది తప్పకుండా పవన్ ఫ్యాన్సే అని ఫిక్స్ అయ్యారు. ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి పవన్ తన ఫ్యాన్స్ కు ఓ కచ్చితమైన సదేషం ఇవ్వాల్సిందే అని అంటున్నారు కొందరు రాజకీయ, సిని ప్రముఖులు. మరి నిజంగానే పవన్ కళ్యాణ్ నోరు విప్పే టైం వచ్చిందా.. కత్తి మహేష్ కు కూడా పవన్ కౌంటర్ ఇవ్వనున్నాడా అన్నది తెలియాల్సి ఉంది.Related Post

సినిమా స‌మీక్ష