మాస్ రాజా మరో హిట్ గ్యారెంటీ అంట..!

January 19, 2018


img

రెండేళ్ల తర్వాత మాస్ మహరాజ్ రవితేజ నటించిన రాజా ది గ్రేట్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి హిట్ కొట్టింది. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో రవితేజ మళ్లీ తన మునుపటి ఫాంలోకి వచ్చాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం విక్రం సిరికొండ డైరక్షన్ లో రవితేజ చేస్తున్న సినిమా టచ్ చేసి చూడు. ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తున్న సాంగ్స్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తుండగా వచ్చే వారం రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాతో మళ్లీ రవితేజ హిట్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు. మాస్ మహరాజ్ రవితేజ ఎనర్జీకి సరితూగేలా సినిమా కథ కథనాలు ఉంటాయని అంటున్నారు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా కూడా వస్తుందని తెలుస్తుంది. రవితేజ ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో ఓ సినిమా ఓకే చేశాడు.Related Post

సినిమా స‌మీక్ష