రూమర్స్ కు చెక్.. ముహుర్తం పెట్టిన చరణ్..!

January 19, 2018


img

మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో రంగస్థలం మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పూర్తి కాకముందే బోయపాటి శ్రీనుతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు చరణ్. నిన్న మొన్నటిదాకా వీరి సినిమా క్యాన్సిల్ అంటూ కామెంట్లు వచ్చినా ఈరోజు ఈ సినిమాకు ముహుర్తం పెట్టేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి వనదేవత టెంపుల్ దగ్గర ముహుర్తపు షాట్ తీశారు.

త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తుందట. ఎలాగు రంగస్థలం షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందని అంటున్నారు. అయితే బోయపాటి సినిమా మొదటి షెడ్యూల్ మొత్తం హీరో లేకుండా చేస్తారట. చరణ్ సెకండ్ షెడ్యూల్ నుండి షూటింగ్ లో ఉంటాడట. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బోయపాటి సినిమాలకు తెలుగులో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. మరి చరణ్ తో బోయపాటి శ్రీను చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష