అజ్ఞాతవాసిలో వెంకటేష్ వస్తున్నాడు..!

January 12, 2018


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలో వెంకటేష్ ఉంటాడన్న వార్త రిలీజ్ ముందు హంగామా చేసింది. రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లను రాబడుతుంది. టైటిల్ కార్డ్ లో వెంకటేష్ పేరు జత చేశారు కాని సినిమాలో వెంకటేష్ లేడు. అయితే సంక్రాంతి నుండి వెంకటేష్ సినిమాలో సందడి చేస్తాడట. చిత్రయూనిట్ అఫిషియల్ గా ఈ విషయాన్ని డిక్లేర్ చేశారు.

ఇక వెంకటేష్ ఎలాంటి సీన్ చేస్తున్నాడో ఆ సీన్ డబ్బింగ్ క్లిప్ కూడా రిలీజ్ చేశారు. సంక్రాంతికి ఈ స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నారన్నమాట. సినిమా హిట్ అయితే రిపీటెడ్ ఆడియెన్ కోసం ఈ సర్ ప్రైజ్ ఉంచారు. కాని సినిమా డివైడ్ టాక్ రావడంతో ఇప్పుడు వెంకటేష్ అజ్ఞాతవాసి కలక్షన్స్ పెంచేందుకే వస్తాడని అంటున్నారు. మొత్తానికి వెంకటేష్ స్పెషల్ అప్పియరెన్స్ సినిమాను ఎంతవరకు కాపాడుతుందో చూడాలి.

Related Post

సినిమా స‌మీక్ష