మహేష్ మళ్లీ నిరాశపరచాడు..!

January 12, 2018


img

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో భరత్ అను నేను సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ సిఎంగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ న్యూ ఇయర్ గిఫ్ట్ గా వస్తుందని అనుకోగా అది మిస్ అయ్యింది. ఇక ఇప్పుడు సంక్రాంతికి ఫస్ట్ లుక్ ఏదైనా వస్తుందేమో అనుకుంటే అలాంటిదేమి లేదని అంటున్నారు.

బ్రహ్మోత్సవం, స్పైడర్ అంచనాలను అందుకోలేకపోవడం వల్ల భరత్ అను నేను సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు మహేష్. ఈ సినిమా హిట్ టార్గెట్ తో తెరకెక్కిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఏప్రిల్ 27న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా మహేష్ కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ కాంబినేషన్ లో మరోసారి శ్రీమంతుడు లాంటి హిట్ కొట్టాలని చూస్తున్నారు.Related Post

సినిమా స‌మీక్ష