నా పేరు సూర్య కోసం అదిరిపోయే సాంగ్..!

January 12, 2018


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరక్షన్ లో వస్తున్న సినిమా నా పేరు సూర్య. సమ్మర్ టార్గెట్ తో వస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ ఫ్యాన్స్ ను అలరించింది. బన్ని సోల్జర్ గా నటిస్తున్న ఈ సినిమాకు విశాల్ శేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఓ స్పెషల్ సాంగ్ కంపోజ్ చేస్తున్నారట మ్యూజిక్ ద్వయం. 

బన్ని ఇమేజ్ కు సరిపోయేలా ఈ సాంగ్ ఉంటుందట. అంతేకాదు సినిమాలోని ఈ సాంగ్ కు బన్ని డ్యాన్స్ కూడా కుమ్మేస్తాడని అంటున్నారు. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తుంది. తప్పకుండా బన్ని కెరియర్ మైల్ స్టోన్ మూవీగా ఈ సినిమా నిలుస్తుందని అంటున్నారు. సరైనోడు, డిజె సినిమాల తర్వాత బన్ని చేస్తున్న ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష