2.ఓ షాకింగ్ రన్ టైం..!

January 11, 2018


img

సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా 2.ఓ. రోబో సీక్వల్ గా వస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ 450 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హాలీవుడ్ సినిమా రేంజ్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా రన్ టైం రివీల్ అయ్యింది. ఇంత భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా అవసరమైతే మరో పావు గంట ఎక్కువ వస్తుందని అభిమానులు ఆశిస్తుంటే సినిమా బయటకు వచ్చిన సినిమా నిడివి చూసి అందరు షాక్ అవుతున్నారు.

కేవలం 100 నిమిషాల డ్యూరేషన్ తో ఈ సినిమా వస్తుందట. అంటే రెండు గంటల కన్నా తక్కువే అన్నమాట. బడ్జెట్ మాత్రం 450 కోట్లు కాని రన్ టైం మాత్రం ఇంత తక్కువ ఏంటని అందరు షాక్ అవుతున్నారు. రజినికి జోడిగా సినిమాలో ఎమీ జాక్సన్ నటిస్తుండగా ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి హాలీవుడ్ స్టైల్ ను ఫాలో అవుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష