బాలయ్యకు గ్రీన్ సిగ్నల్..!

January 11, 2018


img

జై సింహాగా రేపటి నుండి థియేటర్ లో సందడి చేయనున్న బాలయ్యకు రోజుకి 7 షోలు పర్మిషన్ ఇస్తూ ఏపి ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది. జనవరి 12 నుండి 16 వరకు రాత్రి 1 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు స్పెషల్ షోస్ వేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాకు కూడా ఇదే రేంజ్ లో 8 రోజుల పాటు రోజుకి 7 షోస్ పర్మిషన్ వచ్చింది.

ఇక ఇప్పుడు బాలకృష్ణ జై సింహాకు కూడా ఇదే విధంగా స్పెషల్ షోస్ కు పర్మిషన్ ఇచ్చారు. అయితే తెలంగాణాలో మాత్రం జై సింహాకు ఎలాంటి స్పెషల్ షోస్ లేవు. హైదరాబాద్ లోనే రేపు ఉదయం ఆరున్నరకు ఓ షో వేస్తున్నారని తెలుస్తుంది. కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న జై సింహా సినిమాను సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు చిరంతన్ భట్ మ్యూజిక్ అందించారు.     Related Post

సినిమా స‌మీక్ష