త్రివిక్రం మీకిది తగునా..!

January 11, 2018


img

మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ సినిమా అంటే ఆ సినిమా రేంజ్ ఏంటో అందరికి తెలిసిందే. పవన్, మహేష్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేసిన త్రివిక్రం కెరియర్ మొదట్లో తరుణ్, లాస్ట్ ఇయర్ నితిన్ తో అఆ సినిమా చేశాడు. సందర్భం ఏదైనా తన మాటలతో అద్భుతమైన భావన కలిగించే త్రివిక్రం పెన్ పవ ఏంటో అందరు అనుభూతి పొందారు. అయితే తీసే సినిమాలు సొంత ఆలోచనలే అయినా వాటిని ఎక్కడో ఓ చోట చూసి, విని కథ సిద్ధం చేస్తాడని టాక్.

రిలీజ్ అయిన అజ్ఞాతవాసి సినిమా హాలీవుడ్ లార్గో వించ్ కథకు దగ్గరగా ఉంది. అయితే ఈ సినిమా దాని అఫిషియల్ కాపీ అన్నది అందరి టాక్. అయితే స్పూర్తి పొందినట్టుగా కనీసం టైటిల్ కార్డ్లో కూడా స్థానం ఇవ్వలేదు. ఫైనల్ గా అజ్ఞాతవాసికి త్రివిక్రం అడ్డంగా దొరికిపోయాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన అఆ సినిమాకు కూడా యద్ధనపూడి సులోచనరాణి మీరా నవల ఆధారంగా తెరకెక్కించారు. అప్పుడు కూడా అ ఆ టైటిల్ కార్డ్ లో ఆమెకు స్థానం సంపాదించలేదు. అయితే అప్పుడు కూడా ఇలాంటి హంగామా చేయడంతో రెండురోజుల తర్వాత టైటిల్ కార్డ్ లో వేశారు. మరి త్రివిక్రం లాంటి డైరక్టర్ కు ఇలాంటి పనులు తగునా అన్నది ప్రేక్షకుల కామెంట్. సినిమా స్పూర్తి పొందటం అనేది తప్పేం కాదు కాని మాత్రుకకు ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇవ్వాల్సిందే.Related Post

సినిమా స‌మీక్ష