అజ్ఞాతవాసి రివ్యూ & రేటింగ్

January 10, 2018


img

రేటింగ్ : 2.5/5

కథ :

ఏబి గ్రూప్స్ కు సి.ఈ.ఓ కావాలనే ఉద్దేశంతో ప్రస్తుతం సి.ఈ.ఓ గోవింద భార్గవ్ అలియాస్ విందా (బొమ్మన్ ఇరాని)ని అతని వారసుడిని చంపేస్తాడు సీతారాం (ఆది పినిశెట్టి). విందా భార్య ఇంద్రాణి (ఖుష్బు) కష్టాల్లో ఉన్న తనని కొడుకు కాపాడతాడని ఎదురుచూస్తుంది. అప్పుడు దిగుతాడు అభిజిత్ భార్గవ్ (పవన్ కళ్యాన్). విందా మొదటి భార్య కొడుకు అయిన అభిజిత్ తాను అనేవాడు ఒకడు ఉన్నాడన్న ఐడెంటిటీ లేకుండా పెంచుతాడు విందా. తనని మేనమామ అప్పాజి (తణికెళ్ల భరణి) దగ్గర పెంచుతాడు. తండ్రి మరణం తర్వాత అతన్ని చంపిన వారిని.. ఏబి ఫార్మా గ్రూప్ ను చూసుకునేందుకు అక్కడ సాధారణ ఎంప్లాయ్ గా జాయిన్ అవుతాడు. అక్కడే సూర్యకాంతం (అను ఇమ్మాన్యుయెల్)తో చనువుగా ఉంటూ తనకు కావాల్సిన పనులు చేస్తుంటాడు. ఇక మరో పక్క సుకుమారి (కీర్తి సురేష్)ను కూడా లైన్లో పెడతాడు. ఇంతకీ అభిజిత్ వచ్చిన పని సాధించాడా..? కథ ఎలా ముగిసింది అన్నది మిగతా సినిమా.

విశ్లేషణ :

అజ్ఞాతవాసి అంటూ అంచనాలను పెంచేసిన సినిమా ఆలోచన బాగుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అన్న ఆలోచనతో తన కొడుకు ఉన్నాడన్న విషయాన్ని కూడా దాచి మిలినియర్ అయిన విందా అతని మరణానికి కారణమైన వారిని హీరో వచ్చి ఏం చేశాడు అన్నది కథ. అయితే ముందునుండి అనుకునట్టుగా ఈ సినిమా కథ లార్గో వించ్ కు దగ్గర పోలికలతో ఉంది. ఆ సినిమా కాపి అని చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు

ఇక సినిమా కథ చిన్నది దానికి అల్లు కున్న కథనం టైం పాస్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడ అంత కనెక్టివిటీ అనిపించదు. సినిమా మొదటి భాగం సోసోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ కాస్త బెటర్. డైలాగ్స్ విషయంలో త్రివిక్రం పెన్ పవర్ మరోసారి తన సత్తా ప్రూవ్ చేసుకున్నాడు. కథ కథనాల్లో ఎంటర్టైన్మెంట్ కోసం అనవసరమైన సీన్స్ పెట్టారని అనిపిస్తుంది. సినిమాలో సైకిల్ ఎక్కి బెల్ట్ తో కొట్టే సీన్ కాస్త విసుగుతెప్పిస్తుంది. 

ఓవరాల్ గా మంచి కథతో వచ్చిన అజ్ఞాతవాసి కథనంలో కొన్ని పొరపాట్లు ఉన్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఇది పండుగ లాంటి సినిమా అవుతుందని చెప్పొచ్చు. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా సినిమా తీర్చిదిద్దారు.

నటన, సాంకేతికవర్గం :

పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోతో సినిమా నడిచింది. అయితే తన కామెడీ సెన్స్ ఈ సినిమాలో ఎక్కువగా వాడారు. సినిమా ప్రతి ఫ్రేం లో పవన్ కనిపిస్తాడు. ఇక హీరోయిన్స్ కీర్తి, అను పాత్రకు అంతంతమాత్రమే అని చెప్పొచ్చు. ఖుష్బు పాత్ర ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె చేత చెప్పించిన డైలాగ్స్ బాగున్నాయి. బొమ్మన్ ఇరాని మళ్లీ ఓ మంచి పాత్రలో కనిపించారు. విలన్ గా ఆది పినిశెట్టి పర్వాలేదు. మురళి శర్మ, రావు రమేష్, వెన్నెల కిశోర్, రఘుబాబు తమ పాత్రలతో ఆకట్టుకున్నారు.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. మనికందన్ సినిమాటోగ్రఫీ బాగుంది.. సినిమా మొత్తం చాలా రిచ్ గా తీశారు. అనిరుద్ మ్యూజిక్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చాడు. మాటలు త్ర్విక్రం మరోసారి పెన్ పవర్ చూపించాడు. ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వర్ రావు ఇంకాస్త ట్రిం చేసి ఉండాల్సింది. సినిమా ఫైట్స్ కూడా స్టైలిష్ గా ఉన్నాయి. 

ఒక్కమాటలో :

పవన్ త్రివిక్రం అంచనాలకు అటు ఇటుగా అజ్ఞాతవాసి.


Related Post

సినిమా స‌మీక్ష