పవన్ అభిమాని బాలయ్యను పొగిడాడు..!

January 09, 2018


img

నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న జై సింహా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అజ్ఞాతవాసికి పోటీగా వస్తున్నా ఏమాత్రం తగ్గట్లేదు బాలకృష్ణ. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్యను ఆకాశానికెత్తేస్తూ పొగిడాడు ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జాని. బాలయ్యను అందరు అపార్ధ చేసుకుంటారు కాని ఆయనతో పనిచేస్తే ఆయన మంచితనం ఏంటో తెలుస్తుందని అన్నారు.

తను పనిచేసిన హీరోల్లో ది బెస్ట్ బాలయ్య బాబు అని అన్నాడు జాని. పవర్ స్టార్ అభిమాని అయిన జాని బాలయ్యను పొగడటం విశేషం. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ డ్యాన్సులు కూడా అదరగొట్టారని అన్నారు జాని మాస్టర్. సి.కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాలో నయనతార, హరిప్రియ, నటాషా దోషి హీరోయిన్స్ గా నటించారు. చిరంతన్ భట్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం బాలయ్య కెరియర్ లో మరో మైల్ స్టోన్ మూవీ అయినట్టే లెక్క. Related Post

సినిమా స‌మీక్ష