వ్యాక్సిన్‌ వికటించి ఏపీలో కూడా ఒకరి మృతి?

January 25, 2021
img

కరోనా సోకకుండా వ్యాక్సిన్‌ వేసుకొంటే ప్రాణాలే పోతే?ఇటువంటి ఘటనలు ఒకటొకటిగా బయటపడుతున్నాయి. వరంగల్‌ అర్బన్ జిల్లా కేంద్రంలోని దీనదయాళ్ నగర్‌ కాలనీలో విధులు నిర్వర్తిస్తున్న గన్నారపు వనిత (49) అనే అంగన్‌వాడి టీచర్ కరోనా టీకా తీసుకొన్న రెండురోజుల తరువాత శనివారం రాత్రి చనిపోగా, గుంటూరులో కూడా అటువంటి ఘటనే పునరావృతం అయ్యింది. 

జిల్లాలోని పెనుమాకకు చెందిన బి.విజయలక్ష్మి (42) అనే మహిళ ఆశా వర్కర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన సహోద్యోగులతో కలిసి కరోనా టీకా వేయించుకున్నారు. టీకా వేయించుకొన్న కొద్దిసేపటికే ఆమెకు తలనొప్పి, వాంతులు మొదలవడంతో టీకా కేంద్రంలోని వైద్యులు వెంటనే ఆమెకు చికిత్స అందించారు. కానీ పరిస్థితి విషమించడంతో వెంటనే గుంటూరులోని గాంధీ ఆసుపత్రికి తరలించగా శనివారం రాత్రి ఆమె బ్రెయిన్ డెడ్‌ అయ్యింది. ఆదివారం తెల్లవారుజామున బ్రెయిన్ స్ట్రోక్‌తో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

కరోనా టీకా వికటించి చనిపోయిన విజయలక్ష్మికి భర్త సాంబశివరావు, సాయికుమార్, శరత్ కుమార్ అనే ఇద్దరు కుమారులున్నారు.

Related Post