వరంగల్‌ అర్బన్ జిల్లాలో ఢీకొన్న ఆర్టీసీ బస్సులు

January 13, 2021
img

వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ దగ్గర కరీంనగర్-వరంగల్ జాతీయ దారిపై ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ డిపో-1 చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ డిపోకు చెందిన బస్సు ఎదురెదురుగా దూసుకువచ్చి ఢీకొన్నాయి. ఈ సమాచారం అందుకొన్న పోలీసులు తక్షణమే అక్కడకు చేరుకొని అంబులెన్సులో గాయపడినవారిని హుజూరాబాద్, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్లతో సహా మొత్తం 24మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇద్దరు బస్సు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పొగ మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా. 


Related Post